భారతదేశం, ఫిబ్రవరి 12 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాాజాగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. గురుకుల అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.
గురుకుల ప్రవేశ పరీక్షను ఈనెల 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.