భారతదేశం, ఆగస్టు 29 -- Telangana Oversees Vidya Nidhi : విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని "మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి" పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 350 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో 250 సీట్లను బీసీ వర్గాలకు, 100 సీట్లను ఈబీసీ విద్యార్థులకు కేటాయించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రముఖ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చదవాలనుకునే విద్యార్...