భారతదేశం, ఏప్రిల్ 2 -- విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం.. విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ చట్టం - 2026 పేరుతో బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటీవలే జరిగిన అసెంబ్లీలో సమావేశంలో ప్రవేశపెట్టగా. పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలున్నాయని. తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఈ సరికొత్త బిల్లుపై సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో.. శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసింది.కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఈ బిల్లుకు మద్దతు పలకగా.. బీజేపీ వ్యతిరేకించింది. సీపీఐ, ఎంఐఎం సభ్యులు కూడా వ్యతిరేకిస్తూనే.. పలు సవరణలు సూచించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించడంతో వారి తరఫున ఎవరూ మాట్లాడ...