భారతదేశం, ఫిబ్రవరి 26 -- తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ముందుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ తర్వాత 1:5 నిష్పత్తిలో రాత పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఈ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను మార్చి 5, 6,7 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక హాల్‌ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ లో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్ర...