భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బకాయిలను క్లియర్ చేస్తేనే విద్యార్థుల సర్టిఫికెట్లను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు పెండింగ్ బకాయిల కట్టలేక విద్యార్థులు సతమవుతున్నారు.ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు. న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి. ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది.

విద్యార్థుల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచే వర్తిస్తాయని పేర్కొంది. ప్రభుత్వం కాలేజీలకు చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర...