భారతదేశం, మార్చి 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈసారి కాలేజీల ఫీజుల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్యూషన్‌ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జీవో(6) జారీ చేసింది.

రాష్ట్రంలో ఉన్న 160 ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను ఖరారు చేసింది. ఈ నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌ కు ఈ నిర్ణయం వర్తిస్తుంది. అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ ఫస్టియర్‌లో చేరినవారికి ఈ ఫీజులనే వర్తిస్తాయి. అత్యధికంగా CBITక...