భారతదేశం, జూలై 22 -- TG EAPCET Second Phase Allotment : తెలంగాణ ఈఏపీసెట్ - 2026 రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కాగా.. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీట్ల కేటాయింపు ఇవాళ(జూలై 22) పూర్తి కానుంది. సీటు పొందిన అభ్యర్థుల వివరాలను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఈ ఏడాది రెండో విడత కౌన్సెలింగ్‌లో బీటెక్ సీట్ల కోసం విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 60 వేలకుపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఏకంగా 26.55 లక్షల వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. దీనిని బట్టి సగటున ప్రతి అభ్యర్థి దాదాపు 44 కళాశాలలు లేదా కోర్సుల ఐచ్ఛికాలను ఆప్షన్లుగా ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థులు సాధించిన ...