భారతదేశం, ఆగస్టు 2 -- TG EAPCET 2026 Final Phase Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అందుబాటులో ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో(ఆగస్ట్ 2) ముగియనుంది.

టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 5 నాటికి పూర్తి చేసి, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం , అప్‌డేట్స్ కోసం https://tg...