Telangana,hyderabad, సెప్టెంబర్ 26 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు. రెండు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్‌ బయోటెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి.

టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చే నెల 5 నుంచి షురూ అవుతుంది. అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

ఇక అక్టోబర్ 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. 10 వరకు వీటిని ఎంచుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ లేదా ఆలోపే మొదటి విడత సీట్లను కే...