భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ లేదా ఆలోపే మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. ఇక సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 13 నుంచి వెబ్ సైట్ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

ఇందులో భాగంగా అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. రెండు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్‌ బయోటెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇక టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ సెకండ్ ఫేజ...