భారతదేశం, ఏప్రిల్ 30 -- TG Govt Double Bedroom Houses : రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవి స్థాయిలో కూడా ఉన్నా కూడా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి. తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్‌కే లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల న...