భారతదేశం, ఆగస్టు 4 -- TG DOST Special Drive 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో కీలకమైన అవకాశాన్ని కల్పించింది. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు డిగ్రీ సీటు పొందలేని వారికి, ఇప్పటివరకు దోస్త్ (DOST) లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారి కోసం 'స్పెషల్ డ్రైవ్ ఫేజ్'తో పాటు 'ఇంట్రా-కాలేజ్ ఫేజ్-2' షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రత్యేక విడతను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు సాధించలేకపోయిన విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.

ఆగస్టు 20, 2026 నుండి ఆగస్టు 21, 2026 వరకు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంటుంది. సీట్ల కేటాయింపు ఫలితా...