భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

టీచర్‌ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు ఈ కోర్సులు చేసుకోవచ్చు. ఈ కోర్సులు చదివేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలో.. క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఈఈఈసెట్‌ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర...