భారతదేశం, అక్టోబర్ 23 -- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 5,385 మంది విద్యార్థులు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు దక్కించుకున్నారు.

చివరి విడత కౌన్సెలింగ్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 34,059 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 9,606 మంది విద్యార్థులు పోటీపడ్డారు. విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వారిలో 5,385 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత ఫీజు చెల్లించి అలాట్...