భారతదేశం, సెప్టెంబర్ 11 -- TG CPGET Counselling Updates : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ (TG CPGET - 2026) కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఉద్దేశించిన 'వెబ్ ఆప్షన్ల' నమోదు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల విభాగం వెల్లడించింది.

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఎంఏ (MA), ఎంకామ్ (M.Com), ఎంఎస్సీ (M.Sc)తో పాటు ఇతర పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో వెబ్ ఆప్షన్లు అత్యంత కీల...