భారతదేశం, జూన్ 4 -- TG Cheyutha Pensions : ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై లబ్ధిదారులకు నగదు రూపంలో ఇచ్చే చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఇటీవలనే ఆదేశించారు. ఫలితంగా ఇకపై ప్రతినెలా లబ్ధిదారుల చేతికి నగదు ఇచ్చే పాత పద్ధతికి తెరపడనుంది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా వివిధ వర్గాలకు చెందిన సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది లబ...