భారతదేశం, ఏప్రిల్ 18 -- Tesla Sales India : ఇండియాలో టెస్లా ఫ్యాన్స్​కి బిగ్​ న్యూస్​! అపరకుబేరుడు ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. తన బెస్ట్​ సెల్లింగ్​ 'మోడల్​ వై'కి చెందిన 3-రో, 6 సీటర్​ వర్షెన్​ని భారత దేశంలో లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని పేరు టెస్లా మోడల్​ వై ఎల్​. మీడియా కథనాల ప్రకారం ఈ ఈవీ వచ్చే వారమే ఇండియాలో అడుగుపెట్టనుంది.

గతేడాది చైనాలో విడుదలైన ఈ లాంగ్-వీల్‌బేస్ వెర్షన్, ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రాబోతోంది. 2025 జులైలో స్టాండర్డ్ మోడల్ వై లాంచ్ అయిన తర్వాత, భారత్‌లో టెస్లా నుంచి వస్తున్న రెండో ప్రధాన ఆఫరింగ్ ఇదే కానుంది.

ఈ నేపథ్యంలో ఈ టెస్లా మోడల్​ వై ఎల్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

భారత మార్కెట్​లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టెస్లా ఆశించిన స...