భారతదేశం, అక్టోబర్ 16 -- కార్లు గాలిలో ఎగరడం అనేది ఇప్పటివరకు మనం సినిమాల్లోనే చూశాము. కానీ దానిని రియాలిటీ తీసుకొస్తోంది దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా! ఎలాన్ మస్క్​కు చెందిన ఈ కంపెనీ.. తమ ప్రతిష్టాత్మక 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌లోని స్పేస్‌ఎక్స్ పరిశోధనా కేంద్రంలో అక్టోబర్ 15న జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ రోడ్​స్టర్ ఈవీ గాలిలోకి ఎగిరింది!

టెస్లా రోడ్‌స్టర్ ఒక భారీ కర్వ్‌డ్ ర్యాంప్‌పై వేగంగా దూసుకెళ్లి, తలకిందులుగా ప్రయాణించడమే కాకుండా, కొన్ని క్షణాల పాటు గాలిలోనే విన్యాసాలు చేస్తూ సురక్షితంగా కిందకు ల్యాండ్ అయింది.

ఈ చారిత్రాత్మక ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ.. "భవిష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు ఉం...