భారతదేశం, ఏప్రిల్ 24 -- దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా లవర్స్​కి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ మోడల్ వై కంటే మరింత సౌకర్యవంతంగా, ఆరుగురు ప్రయాణించే వీలున్న టెస్లా మోడల్ వై ఎల్​ భారత్‌లో అడుగుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ, ధరలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది ఎవరికి బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి పొడవు.

పొడవు: సాధారణ మోడల్ వై పొడవు 4,790ఎంఎం కాగా, మోడల్ వై ఎల్ పొడవు 4,969ఎంఎం. అంటే 179ఎంఎం అదనపు పొడవు పెరిగింది. దీనివల్ల మూడవ వరుస సీట్లను చేర్చి, 6-సీటర్ లేఅవుట్‌ను టెస్లా అందించగలిగింది.

వీల్‌బేస్: వీల్‌బేస్ 2,890ఎంఎం నుంచి 3,040ఎంఎంకి పెరిగింది. దీనివల్ల వెనుక సీట్ల...