భారతదేశం, ఏప్రిల్ 24 -- కొందరికి 25 ఏళ్ల వయసు నుంచి పెళ్లి సంబంధాలు చూసినా.. అస్సలు సెట్ కావు. 30 ఏళ్లు వచ్చేసరికి ఇక పూజలు చేయడం మెుదలుపెడతారు. దాదాపు తిరగని గుడి లేదన్నట్టుగా వెళ్తుంటారు. చాలా మంది వివాహ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మాయి గానీ అబ్బాయి గానీ దొరకడం లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి.. సంబంధాలు వచ్చినా.. జాతకాలకు సరిగా లేవని ఆగిపోతుంటాయి. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ఆలయాలకు వెళ్తే పెళ్లి అవుతుందని నమ్మకం. ఆ ఆలయాలు ఏంటో చూద్దాం..

ఇది 9వ శతాబ్దానికి చెందిన పురాతన శక్తి ఆలయం. ఈ దేవత పేరు మీదుగానే మంగళూరు నగరానికి ఆ పేరు వచ్చింది. మంగళూరు దేవత అయిన మంగళా దేవి దర్శనం జీవితంలో శుభాన్ని చేకూరుస్తుంది. అమ్మాయిలు మంచి భర్త కలగాలని, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇక్కడ పూజలు చేస్తారు.

మంగళూరుల...