భారతదేశం, జూలై 14 -- Telugu Web Series: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఒక భారీ తెలుగు వెబ్ సిరీస్‌ను సిద్ధం చేసింది. 'ఆజాదీ 501' (Azadi 501) పేరుతో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అఫీషియల్ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది.

చాలా మందికి 2016 కాలంలో జరిగిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ హంగామా గుర్తుండే ఉంటుంది. మొబైల్ ఫోన్ల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్న టైమ్‌లో ఒక కంపెనీ కేవలం రూ. 251కే పూర్తి స్థాయి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ అనౌన్స్ చేసి దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ ఆన్‌లైన్ అనౌన్స్‌మెంట్ దెబ్బకు ఏకంగా 7 కోట్లకు పైగా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. తీరా చూస్తే సాధారణ కస్టమర్లకు ఆ ...