భారతదేశం, జూలై 7 -- Telugu Web Series: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో ఇప్పుడు 'ఆకలి రాజ్యం 2026' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. తాజాగా మంగళవారం (జులై 7) ఈ సిరీస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేయకపోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన కథగా రూపొందించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

ఆకలి రాజ్యం సినిమా గుర్తుందా? అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట వచ్చిన మూవీ. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి ఉద్యోగాలు దొరక్క కష్టాలు పడే కొందరు యువకుల చుట్టూ తిరిగే కథ అది. కమల్ హాసన్, శ్రీదేవి జీవించేశారు. ఇప్పుడదే టైటిల్ తో ఆహా వీడియో ఓటీటీ ఓ కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ఆకలి రాజ్యం 2026 అంటూ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్క...