భారతదేశం, జూన్ 7 -- Telugu Techie Killed USA : అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ.. అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ పని చేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా కాల్చిచంపారు.

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ కుంచా(28) అమెరికాలో ఓ ఎంఎన్సీ కంపెనీలో) ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్స్ లో అదనపు సంపాదన కోసం ఆయన పార్ట్ టైమ్ పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. శనివారం రాత్రి అన్షుల్‌కు ఒక పిజ్జా డెలివరీ ఆర్డర్ వచ్చింది. అయితే అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం వేసిన ఫేక్ ఆర్డర్ అని ఆయన ఊహించలేకపోయాడు.

ఆర్డర్ వచ్చిన అడ్రస్ ప్రకారం ఆయన ఒక నిర్మానుష్య ప్రాంతానికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. అన్షుల్ అక్కడికి చేరుకోగానే. అక్కడ ఉన్న గుర్...