భారతదేశం, నవంబర్ 16 -- Telugu OTT: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన చిత్రం 'క్రేజీ కళ్యాణం'. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా.. అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఈ క్రేజీ కళ్యాణం సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. నవంబర్ 20 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

పర్వతాలు (నరేష్) అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు....