భారతదేశం, అక్టోబర్ 26 -- తెలంగాణ వ్యాప్తంగా రాత్రివేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రెండు మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. ఆదిలాబాద్, ఆసిపాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగింది. ఇక హైదరాబాద్‌లోనూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.

హైదరాబాద్‌లో శీతాకాలపు చలి కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమారు 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం అక్టోబర్ 25 నాడు పటాన్‌చెరులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అమీన్‌పూర్‌లో 14.9 డిగ్రీల సెల్సియస్, సెరిలింగంపల్లిలోని బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీయూలలో చెరో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో 15.4 డిగ్రీల సెల్స...