భారతదేశం, సెప్టెంబర్ 22 -- Telangana Weather Alert : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరుతో పాటు పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తు...