భారతదేశం, జూన్ 6 -- భాగ్యనగర ప్రజలను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఉక్కపోతకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్ నగర్‌, సనత్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో వాన జల్లులు పడ్డాయి. అదేవిధంగా నగర శివారు ప్రాంతాలైన హైదర్‌గూడ, ఉప్పరపల్లి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌లలో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం కురిసింది.

గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు. మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. ఎండల తీవ...