Telangana SSC Exams 2027 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి!
భారతదేశం, నవంబర్ 22 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2027వ సంవత్సరానికి సంబంధించిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(SSC) పరీక్షల టైమ్‌టేబుల్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపింది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు మార్చి 17 లేదా 18న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పరీక్షలు ఒక నెల రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 10వ తేదీతో పరీక్షలు ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు. మెుత్తం 24 రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల మధ్య గ్యాప్ ఉంటుంది.
ఇక పరీక్షా రుసుమును అక్టోబర్ 30 నుండి నవంబర్ 16 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించాలి. నిర్ణీత గడువులోగా రుసుము చెల్లించలేని విద్యార్థులు ఆలస్య రుసుమును చెల్లించి పొడిగించిన గడువు తేదీలలో ఫీజు పే చేయవచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.