భారతదేశం, జూలై 14 -- Telangana Special TET 2026 Notification : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం త్వరలోనే ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 21న జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. సెప్టెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్‌సర్వీస్ టీచర్లు దాదాపు 20 వేల మంది వరకు ఉండవచ్చని ఒక అంచనా.

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేసే ఉపాధ్యాయులకు టెట్...