భారతదేశం, ఏప్రిల్ 20 -- Rythu Bharosa 2nd Installment : రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ రెండో విడుత నిధులు విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ఈ డబ్బులను విడుదల చేసి. రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఇవాళ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు.

తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముంద...