భారతదేశం, అక్టోబర్ 30 -- తెలంగాణలో అక్టోబర్ 30 శుక్రవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి-భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వానలు పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా రాత్రి సమయంలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల ...