భారతదేశం, మార్చి 25 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌డంతో ప‌లు చోట్ల చెట్లు ప‌డిపోయాయి. కొమ్మ‌లు విరిగి క‌రెంటు తీగ‌ల‌మీద ప‌డ్డాయి. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అలాగే ర‌హ‌దారుల్లో వ‌ర్ష‌పు నీరు ని...