భారతదేశం, సెప్టెంబర్ 12 -- దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని హెదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో...