భారతదేశం, జూన్ 27 -- Telangana Weather Report : తెలంగాణ వ్యాప్తంగా రాగల వారం రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 27 నుండి జూలై 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతుందనే వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. జూన్ 27 సాయంత్రం నుంచి జూన్ 28 ఉదయం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షా...