భారతదేశం, ఆగస్టు 3 -- రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు ఈదురు గాలులు వీచే అవకాశముంది.

ఆగస్టు 3 మధ్యాహ్నం 1:00 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈదురుగాలులు, ఉరుములు పడే సూచనలు ఉన్నందున ప్రజలు, ర...