భారతదేశం, ఆగస్టు 19 -- Telangana Movie Tickets: తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల సినిమా టికెట్ ధరలపై జారీ చేసిన కొత్త జీవో హైదరాబాద్ మూవీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో గరిష్టంగా రూ.300 రేటును ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఐమ్యాక్స్ (IMAX), 75 అడుగుల కంటే పెద్ద జెయింట్ స్క్రీన్‌లకు కూడా ఎలాంటి అదనపు ప్రీమియం ఛార్జీలు అనుమతించబోమని పరోక్షంగా స్పష్టం చేసింది.

పక్క రాష్ట్రాలు, ఇతర మెట్రో నగరాల్లో ఐమ్యాక్స్ టికెట్ రేట్లు చుక్కలనంటుతున్న వేళ, హైదరాబాద్ ఆడియెన్స్‌కు మాత్రం జేబుకు చిల్లు పడకుండా వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్‌పీరియన్స్ అందుబాటులోకి రాబోతోంది.

హైదరాబాద్‌లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలోనే మాస్ ఆడియెన్స్ హబ్‌గా పేరొందిన ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర...