భారతదేశం, జూలై 3 -- Telangana ITI Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో (ITIs), అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లలో (ATCs) ఎన్‌సీవీటీ (NCVT)ల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జూలై 10, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో.. దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారానే పరిశీలిస్తారు. అభ్యర్థికి పదో తరగతిలో (SSC) వచ్చిన మెరిట్ మార్కులు మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు లభించిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా సమాచారం అందుతుం...