భారతదేశం, నవంబర్ 7 -- Telangana Inter Exams 2027 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా... ఈసారి వార్షిక పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేయగా.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒకరోజు ఫస్ట్ ఇయర్, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒకే సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే సమయం దొరుకుతోంది. దీంతో పాఠ్యాంశాలను సరిగ్గా పునశ్చరణ (రివిజన్) చేసుకోవడానికి సమయం చాలక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

ఈ పరిస్థ...