భారతదేశం, నవంబర్ 12 -- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (మార్చి 2027) రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి మరో అప్డేట్ ఇచ్చింది. మార్చి 2027 వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది.

మొదటి సంవత్సరం , రెండవ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ప్రైవేట్‌గా (అపెండెడ్/ఫెయిల్ అయిన) హాజరవుతున్న విద్యార్థులందరికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

ఫీజు చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గడువు ముగిసేవరకు వేచి చూడకుండా విద్యార్థులు వీలైనంత...