భారతదేశం, అక్టోబర్ 23 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావొస్తున్న తరుణంలో ఇప్పటివరకు ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యా మండలి మరో అవకాశం కల్పించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు అక్టోబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అవకాశం ఉంటుందని ప్రకటన జారీచేసింది.

ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులు నేరుగా చేరవచ్చని.. ఒకవేళ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకుంటే ప్రతి అడ్మిషన్‌కు రూ.500 ఆలస్య రుసుము (లేట్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియలో ప్రైవేట్ కళాశాలలు ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు ఇప్పటికే హెచ్చరించింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ప్రాతిపదికన మాత్రమే సీట్లను భర్తీ చేయాలని ఆదేశిం...