భారతదేశం, జూన్ 22 -- Telangana Heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రాగల నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

జూన్ 22 ఉదయం నుంచి జూన్ 23 ఉదయంలోపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ...