భారతదేశం, మే 16 -- Telangana Govt Employees : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కీలక సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదీర్ఘంగా ప్రస్తావించారు. ప్రధానంగా కొత్త పీఆర్సీ (PRC) నివేదిక, ఉద్యోగుల ఉచిత వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు, దీర్ఘకాలంగా నిలిచిపోయిన...