భారతదేశం, మార్చి 5 -- రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మకంగా 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని చేపట్టనుంది. 99 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ లోని మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చే దిశగా ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తి చేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థంగా అందించడం వంటి లక్...