భారతదేశం, మార్చి 28 -- రాష్ట్ర రవాణాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. ఇప్పటికే షోరూమ్ ల వద్ద రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రవాణాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌) కార్డులను నేరుగా ఇంటికే పంపనుంది. ప్రింటింగ్ తోపాటు డెలివరీ ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 61 RTO ఆఫీసుల నుంచి ఈ కార్డులను వాహనదారులకు పంపిస్తున్నారు. కొన్ని కార్డులు సకాలంలో అందుతున్నప్పటికీ. చాలా కార్డుల డెలివరీలో ఇబ్బందులు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ విధానంలో ఆలస్యంతో పాటు మధ్యవర్తుల జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ప్రమేయమే లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత...