భారతదేశం, నవంబర్ 24 -- రాబోయే రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరోవైపు నవంబర్ చివరి నాటికి చలి తీవ్రత పెరగనుంది. తాజా వాతావరణ సూచనల ప్రకారం, నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

ముఖ్యంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వన...