Telangana Cheyutha Pensions : చేయూత కొత్త పింఛన్లపై అప్డేట్ - ఈ తేదీ నుంచే మీ చేతికి పత్రాలు..! డబ్బుల జమ ఎప్పుడంటే..?
భారతదేశం, నవంబర్ 10 -- Telangana Cheyutha Pensions : రాష్ట్రంలోని నిరుపేదలు, ఆసరా లేని వర్గాలకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చేయూత పథకం కింద నూతనంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని హకీంపేట వేదికగా నిర్వహించిన మహిళా సంఘాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 4.5 లక్షల పెన్షన్లను మంజూరు చేసింది. మొత్తం మంజూరైన పెన్షన్లలో ఏకంగా 3.5 లక్షల పెన్షన్లను కేవలం ఒంటరి మహిళలు, వితంతువులకే అందజేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల జాబితాతో పాటు మంజూరు పత్రాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.