భారతదేశం, మార్చి 22 -- భవన నిర్మాణాలకు సంబంధించి టీడీఆర్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు 'తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్‌ 2012'కి సంబంధించి కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నుంచి తాజాగా జారీ అయిన జీవో ప్రకారం.. 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించనున్న వాటిని హైరైజ్‌ భవనాలుగా గుర్తిస్తారు. 750 చ.మీ నుంచి 2000 చ.మీలు ఉన్న స్థలంలో 18-21 మీటర్ల భవనాలు నిర్మించాలంటే టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి. నాన్‌ హైరైజ్‌ భవనాలకు టీడీఆర్‌ వినియోగంతో సెట్‌బ్యాక్‌ సడలింపు ఇచ్చారు. (జీవో ఎంఎస్ నం. 95) ఉత్తర్వులు జారీ చేసింది.

40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా.. 80 ఫీట్ ర...