భారతదేశం, మార్చి 8 -- రాష్ట్ర శానససభ, మండలి సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆ మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈనెల 20వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈనెల 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ...