భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి వెల్లడించారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.

తెలంగాణ బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపులు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కానుంది. ఇంటర్‌ వి...