భారతదేశం, మార్చి 16 -- తెలంగాణ సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని గవర్నర్ సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలను సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. ఆవిష్కరణల్లో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులందరికీ గవర్నర్.. హృదయపూర్వక స్వాగతం పలికారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌తో ముందుకు...